Ransomware: ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ర్యాన్సమ్‌వేర్ దాడులకు లక్ష్యంగా మారుతున్న భారత్

by S Gopi |
Ransomware: ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ర్యాన్సమ్‌వేర్ దాడులకు లక్ష్యంగా మారుతున్న భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఓవైపు పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం నేపథ్యంలో సైబర్ దాడులు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశీయంగా పెరిగిన డిజిటల్ విప్లవంతో ర్యాన్సమ్‌వేర్ దాడులు గణనీయంగా జరుగుతున్నాయి. ప్రముఖ స్కేలర్ థ్రెట్‌ల్యాబ్స్ తాజాగా నిర్వహించిన నివేదిక ప్రకారం.. ఆసియా పసిఫిక్, జపాన్ ప్రాంతంలో అత్యధిక ర్యాన్సమ్‌వేర్ దాడులను ఎదుర్కొంటున్న జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. 2023, ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య జరిగిన ర్యాన్సమ్‌వేర్ దాడులను పరిశీలించిన తర్వాత కీలకమైన రంగాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉందని నివేదిక అభిప్రాయపడింది. భారత్‌లో దాడుల సంఖ్య గతంలో కంటే స్వల్పంగా తగ్గినప్పటికీ, కొత్తగా ఏఐ ఆధారిత సైబర్ దాడులు కొంత ఆందోళన కలిగించే అంశం. ఇక, ప్రపంచవ్యాప్తంగా కూడా ర్యాన్సమ్‌వేర్ దాడులు గతేడాది కంటే 18 శాతం పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఈ దాడుల కారణంగా వివిధ సంస్థలు 75 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఈ మొత్తం ఇప్పటివరకు అత్యధికం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సంస్థలకు సైబర్ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ర్యాన్సమ్‌వేర్ దాడి అనేది ఏదైనా కంపెనీ కంప్యూటర్‌ వ్యవస్థలోకి చొరబడి, ఆ సిస్టమ్‌ను ఆధీనంలోకి తీసుకుంటారు. ఇది ఫైల్స్, సిస్టమ్‌లు, నెట్‌వర్క్‌లను కంపెనీలు యాక్సెస్ చేయకుండా చేస్తారు. ర్యాన్సమ్‌వేర్ దాడులు ఆపేందుకు సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed