అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

by Y.Nagarani |
అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకుగాను గడువును పొడిగించారు. ఈనెల 30వ తేదీ వరకు అప్లికేషన్ కు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఇన్ చార్జీ రిజిస్ట్రార్ సుధారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా అక్టోబర్ 30వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు 7382929570/580, లేదా 040-23680222/333/444/555, టోల్‌ఫ్రీ నంబర్ 18005990101లో సంప్రదించాలని సూచించారు. మరింత సమాచారం కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed