- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడండి
దిశ, వాంకిడి: వేసవిలో గిరి గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం మండలంలోని ఎనోలి కొలాంగూడ గిరి గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లోని మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పై కలెక్టర్ ఆరా తీశారు. ఎనోలి కొలాం గూడలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ ఉండటంతో, గత కొంత కాలంగా నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ మరమ్మతులు చేపట్టి గ్రామస్థులకు నీరు అందేలా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో సురేందర్‌లతో కలసి బెండార, వాంకిడి గ్రామాల్లో నిర్వహిస్తున్న నీటి కుంట కాలువల పూడికతీత పనులను పరిశీలించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 100 రోజులకు తగ్గకుండా ఉపాధి పనులు కల్పిస్తూ పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్నారు. పోస్టల్ శాఖ సిబ్బంది తమ కూలీ డబ్బులు చెల్లించేటప్పడు ఇబ్బంది పెడుతున్నారని, అకౌంట్‌లో డబ్బులు ఉన్న తమకు ఇవ్వడం లేదని. కొంత మంది కూలీల అకౌంట్స్ లాక్ పడి ఉన్న ఇప్పటివరకు అన్ లాక్ చెయ్యడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రోహిత్, ఎంపీడీవో వరలక్ష్మి, ఈజీఎస్ శ్రావణ్ కుమార్, తదితరులు ఉన్నారు.