- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ వేధింపులతోనే సర్పంచ్ భర్త రామగౌడ్ మృతి..
దిశ, భీమిని : రాష్ట్ర ప్రభుత్వం వేధింపులతోనే భీమిని మండలం విగాం సర్పంచ్ గట్టు తులసిబాయి భర్త రామగౌడ్ గుండె పోటుతో మృతి చెందినట్టు బీజేపీ బెల్లంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి కొయ్యల ఏమాజి ఆరోపించారు. సోమవారం వీగాం సర్పంచ్ తులసిబాయితో పాటు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామంలో వివిధ అభివృధి పనులకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారని. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదనీ. దీనికి డీ.ఎల్.పీ.ఓ, కార్యదర్శి వేధింపులే కారణమని విమర్శించారు. బిల్లులు మంజూరు చేయక పోవడంతో గట్టు రామగౌడ్ మనోవేదనకు గురయ్యారనీ తెలిపారు. మార్చి నాటికి బిల్లులు రాకుంటే నిధులు లాప్స్ అవుతాయని ఆందోళన చెందినట్లు తెలిపారు.
రామగౌడ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కావడం వల్లే వారు బిల్లులు చెల్లించక వేధించారని తెలిపారు. గ్రామ పంచాయతీలో నిధులున్నా కావాలనే ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ లకు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులను దారి మల్లిస్తోందని, దీని వలన అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. బిల్లులు వెంటనే ఇవ్వాలనీ, సంబంధిత అధికారుల పై చర్య తీసుకోవాలని ఏమాజి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవరెడ్డి, కన్నేపల్లి మండల అధ్యక్షులు రామయ్య యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, నర్సింగ్ పాల్గొన్నారు.