బిల్లుల కోసం మొరపెట్టుకున్న సర్పంచులు..!!

by Sumithra |
బిల్లుల కోసం మొరపెట్టుకున్న సర్పంచులు..!!
X

దిశ, కుబీర్ : కుబీర్ మండల సర్వసభ్య సమావేశం గురువారం మండల అధ్యక్షురాలు తూము లక్ష్మీబాయి అధ్యక్షతన జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన సీసీ రోడ్ల పనులు, మన ఊరు మనబడి కింద చేసిన పనులకు బిల్లులు రావడం లేదని సర్పంచులు ఈ సమావేశంలో మొరపెట్టుకున్నారు. సంబంధితశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లు చేసినా స్పందించడం లేదని సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. వేసవికాలంలో తాగునీటి సమస్య పై చర్చించాల్సి ఉండగా, మిషన్ భగీరథ అధికారులు తమ క్రింది స్థాయి సిబ్బందిని పంపించడంపట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్తీ తెల్లకల్లు విక్రయాలు జోరుగా జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని చోండి సర్పంచ్ అన్నారు. వంటచేయాలల్లోని వంగిన విద్యుత్ స్తంభాలు కిందికి వేలాడుతున్నా విద్యుత్ తీగలను సరిచేయాలని మండల కోఆప్షన్ సభ్యుడు దత్త హరి పటేల్ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు సీపీఆర్ పై అవగాహన కల్పించారు. మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవో లింబాద్రి, తహసిల్దార్, విశ్వంబర్, వైస్ఎంపీపీ మొహీనుద్దీన్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు సంబంధించిన శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story