- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ దోపిడీ పాలనకు చరమగీతం పాడాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, కాగజ్ నగర్: రానున్న ఎన్నికల్లో కేసీఆర్ నియంత్రుత్వ, దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేత రాజ్ కుమార్ యాదవ్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రా నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే కొనేరు కోనప్ప సిర్పూర్ ప్రాంత ప్రజలపై దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతూ వనరులు, సంపాదనను దోచుకొని అక్రమంగా వందల కోట్లు ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. ఎమ్మెల్యే కోనప్ప దౌర్జన్యాలను ప్రశ్నించే వారిపై పోలీసులతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు. జిల్లా ఎస్పీతో సహా అధికారులందరూ ఉత్సవ విగ్రహాలుగా మిగిలి, కోనేరు కోనప్ప చేతిలో బందీ అయ్యారని ఆరోపించారు.
భీమిని మండలం చిన్న గుడిపేట గ్రామస్తులు ఓట్ల కోసం వచ్చిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై తిరగబడి, తరిమికొట్టారన్నారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కనీసం రోడ్లు కూడా వేయలేని మీరు ఏం వెలగబెట్టారని? ఓట్ల కోసం పల్లెల్లో తిరుతున్నారని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కొనప్ప చేస్తున్న అరాచకాలకు నవంబర్ 30 న ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ చేసే రాజకీయ పోరాటం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపి పార్టీలతో కాదన్న ఆయన కోనప్ప దౌర్జన్యాలను అడ్డుకోవడం కోసం పార్టీలకతీతంగా ప్రజలందరూ ఒక్కటై బీఎస్పీకి ఓట్లేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఎస్పీలో చేరారు. అనంతరం బెంగాలీ క్యాంప్ నెంబర్-7 లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా ఇంఛార్జి సోయం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం..
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ పట్టణ పరిధిలోని పెద్దవాగు వద్దపై ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉండగా వెనుక వైపు నుండి లారీ బలంగా ఢీ కొట్టింది.ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు.