- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుకులాల్లో నాణ్యమైన విద్య, భోజనం అందించాలిః కలెక్టర్ రాజర్షి షా
దిశ, ఆదిలాబాద్ః జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలని కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వసతి గృహాలలోని వంట గదులు, మూత్రశాలలో మరుగుదొడ్లు అందులోని పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఆయా శాఖల జిల్లా అధికారులతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లా స్థాయి అధికారి హాస్టల్స్, పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలను విధిగా తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు అందించే ఆహారం మెనూ పకడ్బందీగా ఉండాలని, ఏ రోజు మెనూ ఆ రోజు తప్పనిసరిగా అమలు చేయాలని, శుభ్రత పాటించాలని సూచించారు.
డెంగ్యూ జ్వరాలు ఏమైన ఉంటే శాంపిల్స్ రిమ్స్ కు పంపించాలని, వచ్చే 45 రోజుల పాటు అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ మెరుగైన చికిత్సను అందించడం తోపాటు అంటూ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అబిగ్యాన్, డి ఆర్ డి ఓ సాయన్న, జిల్లా వైద్యాధికారి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.