పౌష్టికాహారాన్ని అందించాలి

by Sridhar Babu |
పౌష్టికాహారాన్ని అందించాలి
X

దిశ, ఉట్నూర్ : అంగన్​వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అంతకు ముందు ఇంద్రవెల్లి మండలంలోని దెబ్బతిన్న పంటలను శుక్రవారం పరిశీలించారు. మండలంలో మార్కగూడ, గిన్నేర, పాటగూడ, లాల్ టేకిడ్ గ్రామాలలో కలెక్టర్ పర్యటించారు. వర్షానికి మార్కగూడ దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి నిల్వ ఉన్న సరుకులను, రికార్డులను పరిశీలించి చిన్నారులకు భోజనంను వడ్డించారు. అనంతరం మూత్నూర్ సెక్టార్ గిన్నెర అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాటగూడ, లాల్ టెకిడ్ లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, వంతెనలను పరిశీలించారు.

అంగన్ వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిషోర్ బాలికలు వచ్చే వారి వివరాలు మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదును పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కేంద్రానికి వచ్చే వారికి పప్పుతో పాటు ఆకుకూరలు, కూరగాయలతో పౌష్టికాహారాన్ని అందించాలని, బలమైన ఆహారం అందించినపుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పోషణ అభియాన్ లో భాగంగా సెప్టెంబర్ పోషణ మాసంలో గిన్నెర అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బాలామృతంతో చేసిన లడ్డూలను చిన్నారులకు అందించి అభివృద్ధి ఉందా లేదా నిత్యం పరిశీలిస్తూ ఉండాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఒ సాయన్న, పీఆర్ ఈఈ శివరామ్, డీఈ రమేష్, ఏసీడీపీఓ మిల్కా, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story