- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సార్కు.. సమస్యల సవాళ్లు
దిశ, మంచిర్యాల టౌన్: సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం కేసీఆర్ కు జిల్లాలోని ప్రజలు సమస్యల సవాళ్లు విసురుతున్నారు. గతంలో ఎన్నికలకు మంచిర్యాల జిల్లా కు వచ్చి వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ ఇటువైపు సమస్యలపై పెద్దగా దృష్టి సారించలేదనే చర్చ కొనసాగుతోంది. సింగరేణి పై కేసీఆర్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని కార్మిక వర్గాలంటున్నాయి. రూ. 400 కోట్ల తో సింగరేణి కార్మికులకు నూతన క్వార్టర్ లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం నాలుగు గేండ్లు దాటినా 10 క్వార్టర్లు కూడా కట్టలేదనే అసంతృప్తిని కార్మిక వర్గాలు వెలిబుచ్చుతున్నాయి.
మంచిర్యాల ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న కేసీఆర్ కనీసం మంచిర్యాల లో వరదలు వచ్చి ఎందరో ఇబ్బందులు పడినా ఎలాంటి సహా సహకారాలు అందించలేక పోయారనే నిరసన జిల్లా కేంద్ర వాసుల్లో నెలకొని ఉంది. మంచిర్యాల పై నిజమైన ప్రేమ ఉంటే గత వర్షాకాలంలో వరదల వల్ల నష్ట పోయిన కుటుంబాల ను, వరద ప్రాంతాన్ని కనీసం వచ్చి సందర్శించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
కాళేశ్వరం బ్యాక్ వాటర్తో గత ఏడాది చెన్నూర్ నియోజక వర్గంలో నష్ట పోయిన రైతులకు శాశ్వత నష్ట పరిహారం అందించాలని ఆందోళనలు కొనసాగినా ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందలేదనే నిరసన గళం ఆ రైతుల్లో వినిపిస్తోంది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు లు అర్హులైన అందరికీ సకాలంలో అందించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి.
అమరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఆదుకొలేక పోయారని, ఉద్యమ కారుల పై కేసులను ఎత్తివేయడానికి చొరవ చూపు లేకపోయారనే అపవాదు ప్రచారంలో ఉంది. పలు సవాళ్లతో కూడిన ప్రశ్నలు జిల్లా ప్రజల నుంచి ఎదురవుతున్నప్పటీకి గతంలో జిల్లాకు వచ్చి మాటలతో బురిడీ కొట్టించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు తమకు ఎలాంటి కొత్త హామీల తో వరాల జల్లు కురిపిస్తాడో అంటూ సారు మాట్లాడే మాటల కోసం ఎదురు చూస్తున్నారు.
Also Read: అనూహ్యంగా వ్యూహం మార్చిన కేసీఆర్.. బలం పుంజుకుంటోదనే భయం!
వచ్చే ఎన్నికల్లో పోటీపై MLC కవిత క్లారిటీ.. ఆత్మీయ సభల్లో కేడర్కు ఉపదేశం!
ఎమ్మెల్యేకు షాక్ ఇస్తున్న ప్రజలు.. ఏం చేశావంటూ వరుసగా నిలదీయడంతో ఫ్రస్ట్రేషన్