- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త వైరస్ పట్ల జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాజర్షి షా
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాను టి బి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంతో జిల్లాలో 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందనీ,అదేవిధంగా చైనా నుంచి వస్తున్న మరో కొత్త వైరస్ పట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లో ఉన్న ఆయా శాఖల ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ మేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. టీవీతో పాటు కొత్తగా వచ్చే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వందరోజుల క్యాంప్ ప్రోగ్రాం లో జిల్లా జైలు,డైట్ గ్రౌండ్ లో చండీ హోమం వద్ద,పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిబ్బందికి ,పాఠశాలలు, కళాశాలలు వీటన్నిటిలో డ్రై మూడ్లో చేయడం జరుగుతుందని అన్నారు. మొబైల్ వ్యాన్ ద్వారా రక్త పరీక్షలు శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి, వ్యాధి నిర్ధారణ తెలుసుకోవడానికి ఎక్స్ రే కూడా తీయడం జరుగుతుందని,వాటిలో ఏమైనా తెలిస్తే వెంటనే చికిత్స ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.ముందుగా 200 మంది ఉద్యోగులకు రక్త పరీక్షలు, ఎక్స్ రే, టీబీ తో పాటు ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ క్యాంపులు ఏర్పాటు చేసి, స్క్రీనింగ్ టెస్టులు చేయాలని వైద్య సిబ్బందిని కోరారు.
ముఖ్యంగా చైనా నుంచి కొత్త వైరస్ బెంగళూరులో ఏర్పడిందని,ఆ వ్యాధి లక్షణాలు గుర్తించినందుకు హెల్త్ డిపార్ట్మెంట్ ఇదివరకే ప్రజలకు,అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందని అన్నారు.కొత్తగా వచ్చే వైరస్ నుంచి మనకు మనం కాపాడుకోవాలంటే ఇంతకుముందు కరోనా పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో,వాటిని పాటించడం అలవర్చుకుంటే ఈ వ్యాధి నుంచి కూడా మనం రక్షించుకో గలుగుతామని అన్నారు. మామూలు లక్షణాలు గల ఫ్లూ లానే ఉండి దీనివల్ల దగ్గు, జలుబు వస్తుందనీ,ఇది ఇతరులకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని,అందుకు అందరూ గుంపులు గా ఒకే చోట ఉండకుండా,ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులు బయటకు వెళ్లకుండా ఇంటిలోనే ఉండాలని,వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి సరియైన మందులు వాడి తగ్గించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో రిమ్స్ డెరైక్టర్ జై సింగ్ రాథోడ్,జిల్లా వైద్యాధికారి నరేందర్, రాథోడ్, టిబి అధికారి సుమ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.