బుమ్రాకు కెప్టెన్సీ వద్దు.. ‘ఎక్స్’ వేదికగా మహమ్మద్ కైఫ్ సంచలన పోస్ట్

by Sathputhe Rajesh |
బుమ్రాకు కెప్టెన్సీ వద్దు.. ‘ఎక్స్’ వేదికగా మహమ్మద్ కైఫ్ సంచలన పోస్ట్
X

దిశ, స్పోర్ట్స్ : టెస్ట్ క్రికెట్‌లో బుమ్రాను కెప్టెన్‌గా నియమించొద్దని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌లలో ఒకరిని భారత టెస్ట్ కెప్టెన్‌గా నియమించాలని కైఫ్ సూచించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కైఫ్ స్పందించాడు. ‘బుమ్రాను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఫిట్‌గా ఉండటంతో పాటు వికెట్లు తీయడంపైనే బుమ్రా దృష్టి సారించాలి. ఈ పరిస్థితుల్లో జట్టు సారథ్య బాధ్యతలు బుమ్రాకు ఇవ్వడం ద్వారా తన కెరీర్‌పై ప్రభావం చూపుతుంది. బంగారు బాతును చంపకండి. రోహిత్‌కు బుమ్రా ప్రత్యామ్నాయం అనేది సరైన ఐడియా కాదు. బుమ్రా జట్టు కోసం తన జీవితాన్ని ధారపోశాడు. ఇతర బౌలర్ల నుంచి ఎలాంటి మద్దతు లభించకున్నా అద్భుతంగా రాణిస్తాడు. వర్క్ లోడ్ వేయడం ద్వారా అతను గాయాల బారిన పడే ప్రమాదం ఉంది. సిడ్నీ టెస్ట్ అదే జరిగింది. పంత్, కేఎల్ రాహుల్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. వీళ్లిద్దరిలో ఒకరు బెటర్ ఛాయిస్.’ అని కైఫ్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed