- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
దిశ, మంచిర్యాల టౌన్ : మధ్యాహ్న భోజన కార్మికులు అనుబంధ సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు దాసరి రాజేశ్వరి, దాగం రాజారాం మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ , రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నెలలు గడిచిన ప్రభుత్వం నుంచి రావాల్సిన వేతనాలు రావడం లేదు. కోడిగుడ్డుకు ప్రభుత్వం చెల్లించేది ఐదు రూపాయలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆరు, ఏడు రూపాయలకు కొనుక్కొని పాఠశాల విద్యార్థులకు పెడుతున్నామని, దీనివల్ల అదనంగా ఒక్కో కార్మికురాలు కోడి గుడ్డుకు రెండు రూపాయలు అదనంగా పెట్టుకోవాల్సి వస్తుందన్నారు.
అంతేకాకుండా ప్రభుత్వం కూడా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఒకవైపు కిరాణా దుకాణ దారునికి, మరోవైపు కుటుంబ పోషణకు అనేక ఇబ్బందులు పడుతున్నామని, అదే విధంగా పాఠశాలలకు సప్లై చేసేటువంటి బియ్యం మొత్తం పురుగులు, రాళ్లతో నిండిన వాటిని పాఠశాలకు సప్లై చేస్తున్నారు. దీనివల్ల బియ్యం అంతా ఉగ్గు ఉగ్గుగా తయారై విద్యార్థులు తినలేక పోతున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ స్పందించని యెడల రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దుంపల రంజిత్ కుమార్, దూరం శ్రీనివాస్ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, బుచ్చన్న, కార్మికులు లక్ష్మణ్ జన్నారం మండల కన్వీనర్, రఫియా, సునీత, పో సక్క, మధు నమ్మ, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.