మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో స్వయం ఉపాధి

by Sumithra |
మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో స్వయం ఉపాధి
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబడిపల్లి గ్రామంలో మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం అవర్ ఫుడ్ జిల్లా ఇంచార్జ్ కే. కమలాకర్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో స్వయం ఉపాధి పొందవచ్చు అన్నారు. గ్రామీణ ప్రాంత యువత, రైతులు, నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అన్నారు. గ్రామాలలో పండిన పంటలను ముడి సరుకు రూపంలో కాకుండా ఆహార శుద్ధి చేసి అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చుని తెలిపారు.

ఈ గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంతో గ్రామంలో పండిన పంటలతో పాటు పరిసర గ్రామాలలో పంటల ఆహార శుద్ధి చేయవచ్చు అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో 20 వేల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవర్ ఫుడ్(OFPL)తో గతంలోనే ఒప్పందం చేసుకుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహకులకు ఎస్ బీఐ బ్యాంకు సహకారంతో మిషనరీ కోసం రుణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా మంజూరు చేస్తామన్నారు. అవర్ ఫుడ్ సంస్థ ద్వారా దాల్ మిల్, వేరుశనగ గానుగ నూనె, మిర్చి, పసుపు, మిల్లెట్స్, మినీ రైస్ మిల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే యూనిట్లు మంజూరు చేయడానికి అవర్ ఫుడ్ సిద్ధంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, రైతులు ప్రశాంత్, సత్యం, రాజులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed