- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి..
దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి మండల సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరైన ప్రభుత్వ శాఖల అధికారులపై జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజా పరిషత్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గోమాస శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో అధికారుల గైర్హాజరపై సభ్యులు మండిపడ్డారు. 21 శాఖల అధికారులు సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా కేవలం 10 శాఖల అధికారులు మాత్రమే హాజరు కావడంతో జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారం చేసేందుకు ప్రతి మూడునెలలకు ఒకసారి జరిగే మండల సమావేశానికి ప్రభుత్వ శాఖల అధికారులు డుమ్మాకొట్టడం బాధ్యతరాహిత్యమని సభ్యులు మండిపడ్డారు. రెవెన్యూ, అటవీశాఖ, ఉద్యాన వనశాఖ, ఆర్ అండ్ బీ శాఖ, ఎక్సైజ్ శాఖ, సాంఘీక సంక్షేమశాఖ, పౌరసరఫరా, ఇరిగేషన్, రోడ్డు రవాణా, మస్త్య శాఖల అధికారులకు ముందుగానే సమావేశం, ఎజెండా కాపీలను పంపించామని ఎంపీడీవో రాజేందర్ తెలిపారు. అధికారుల గైర్హాజరపై సమావేశంలో సుదీర్ఘంగా గరంగరంగాచర్చ జరిగింది. విద్యుత్ సమస్యలు, అధిక బిల్లులపై పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. సమావేశంలో విద్య, వైద్య, విద్యుత్, వ్యవసాయ, స్త్రీ శిషు సంక్షేమ, ఐకేపీ, ఈజీఎస్, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పశు వైద్యం, శాఖల అధికారులు పాల్గొన్నారు.