- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అరకొరగా వైద్య సేవలు
దిశ, బెల్లంపల్లి : సింగరేణిలో భూగర్భ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన బెల్లంపల్లి పట్టణంలో కార్మిక కుటుంబాలకు వైద్యం అరకొరగా అందుతోంది. పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా సింగరేణి ఆస్పత్రిలో వైద్య సేవలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కార్మికులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింగరేణి ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితిని అందుకు తార్కాణంగా పేర్కొనవచ్చు. 1986 సంవత్సరంలో 250 పడకలతో ఏర్పాటుచేసిన ఈ ఆసుపత్రి నానాటికీ వైద్య సేవల్లో దిగజారిపోయింది. కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం నెలకొల్పిన సింగరేణి ఆసుపత్రి గాడి తప్పిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైద్యంపై సీతకన్ను..
బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో వైద్యసేవలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మిక కుటుంబాలు బాహటంగా విమర్శిస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా నిర్మించిన ఏరియా హాస్పిటల్ వైద్య సేవల్లో పూర్తిగా వెనకబడిపోయిందన్న అసంతృప్తులు ఉన్నాయి. హాస్పిటల్‌లో ఒక్క స్పెషలిస్టు వైద్యుడు లేకపోవడం వైద్య సేవల దుస్థితిని స్పష్టం చేస్తోంది. వైద్య సేవలపై యాజమాన్యo చిత్తశుద్ధి ఏ పాటిదో ఈ పరిస్థితి తేటతెల్లం చేస్తోంది. 11 మంది వైద్యుల్లో ఇద్దరు కాంట్రాక్టు డాక్టర్లు ఒక సూపర్డెంట్ తో హాస్పిటల్ నిర్వహణ కొనసాగుతోంది. ఇందులో ఒక్క వైద్య నిపుణులు కూడా లేకపోవడం సింగరేణి ఆసుపత్రిలో వైద్య సేవల తీరు ఎలా ఉందో తెలుస్తుంది.
వైద్య నిపుణుల కొరత..
బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ లో వైద్య నిపుణుల కొరత తీరకుండానే పోతుంది. సింగరేణి యాజమాన్యం దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న వైద్యనిపుణులను భర్తీ చేయాలనే చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఫలితంగా నామ మాత్రమైన వైద్య సేవలకు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి పరిమితమైంది. గైనకాలజిస్ట్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఈఎన్టి, ఫిజీషియన్, డెంటిస్ట్, కంటి వైద్య నిపుణుల ఖాళీలు చిరకాలంగా నిండకుండా ఉండిపోతున్నాయి. మౌలికమైన అత్యవసరమైన వైద్య సేవలను కార్మిక కుటుంబాలు నోచుకోవడం లేదు. మెరుగైన వైద్య సేవలను కల్పించాలన్న ఆలోచన అటు యజమాన్యంకు ఇటు కార్మిక సంఘాలకు బొత్తిగా లేదు.
సింగరేణి ఏరియా హాస్పిటల్ లో వైద్య సేవలు అందక పోవడంతో కార్మిక కుటుంబాలు ప్రైవేట్ హాస్పటలను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యులు అందినంత వైద్యం పేరిట దండుకునే పరిస్థితికి కార్మిక కుటుంబాలు గురవుతున్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు వైద్య సేవలు అందించలేని దుస్థితిలో యాజమాన్యం ఉందంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. కార్మికులకు వారి కుటుంబాలకు వైద్య సేవలు అందించే బాధ్యతను సింగరేణి యాజమాన్యం వదులుకుంది.
అలాగే కార్మిక సంఘాలు సైతం ఇదే విధానాన్ని ప్రదర్శిస్తున్నారు. సింగరేణి ఆస్పత్రిలో అడుగంటిపోతున్న వైద్య సేవలను మెరుగుపరచడంపై కార్మిక సంఘాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కార్మికులు కోరుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వైద్య నిపుణుల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు పురోగతిపై ఏమైనా చర్యలు ఉంటాయో చూడాలి.