- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇటుక బట్టీలో బాల్యం.. పట్టించుకోని అధికారులు
దిశ,సారంగాపూర్ : మండలంలోని పలు గ్రామాలలో ఇటుకబట్టీల వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డు,అదుపు లేకుండా పోయాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా మండలంలోని తాండ్ర, బీరవెల్లి, ప్యారామూర్, జాం గ్రామాలలో కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మట్టి ఇటుకల వ్యాపారాన్ని అడ్డుకునే అధికారులే లేకుండా పోయారు.
దొంగచాటుగా చెరువులు, కుంటలు, శిఖం భూములలో నుండి మట్టిని తీస్తూ ప్రభుత్వ ఆదాయానికి ఇటుక బట్టీల నిర్వాహకులు గండి కొడుతున్నారు. పట్టా భూముల నుండి మట్టిని తీస్తున్నామని చెప్పుకోవడం గమనార్హం. అటు అధికారులు కూడా వత్తాసు పలకడం విడ్డూరం.అంతేకాకుండా పక్క రాష్ట్రాలు అయినటువంటి ఒరిస్సా మహారాష్ట్ర నుండి కార్మికులను తీసుకువచ్చి ఇటుక బట్టీలలో పనికి వినియోగిస్తున్నారు. లేబర్ చట్టంలో పొందుపరిచినటువంటి లింగవివక్ష లేకుండా(ఆర్టికల్ 39) భార్య,భర్తలకు సమాన కనీస వేతనాలు ఇస్తున్నారు. ప్రమాదఇన్సూరెన్స్ ,హెల్త్ కార్డులు, నివాస సముదాయాలు, వాటికి కరెంటు సౌకర్యం లాంటి కనీస సౌకర్యాలుకల్పించకుండా బాల కార్మికులతో కూడా వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఇటుక బట్టిలలోని కార్మికుల శ్రమను సంపాదనగా మార్చుకుంటున్న ఇటుక బట్టి నిర్వాహకులపై ఎలాంటి చర్యలుతీసుకోవడం లేదు. అధికారులు ప్రతి నెలమామూలుతీసుకుంటూ ఇటుక బట్టి నిర్వాహకులకు సలాం అంటూ గులాంగిరి చేస్తున్నట్టు మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇకనైనా ఇలాంటి అక్రమ ఇటుక బట్టీలకు ప్రభుత్వ అనుమతి ఉందా.. ఉంటే ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించే నిర్వహిస్తున్నారా అనేది దానిపై తగువిచారణ జరిపి చర్యలు తీసుకోవలసిందిగా మండల ప్రజలు కోరుతున్నారు.