- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం సభకు మున్సిపల్ ట్యాంకర్లు.. మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్న కాలనీవాసులు..
దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాలలో నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 9న జరిగే సీఎం సభకు మంచిర్యాల మున్సిపాలిటీ నుండి వార్డ్ లకు సప్లై చేసే మంచినీళ్ళ ను వాడడంతో వార్డ్ లోని ప్రజలు మంచి నీటికోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంచిర్యాల పట్టణ మున్సిపాలిటీ నందు మొత్తం 12 మంచినీరు సప్లై చేసే ట్యాంకర్ లు ఉండగా, అవి గత 4 రోజుల నుండి సీఎం సభ జరిగే ప్రాంగణంలోని ఏర్పాట్లకు, నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసే రోడ్ పనులకు, గ్రీనరి కోసం పెంచే గడ్డికి, పూలమొక్కల కోసం అని మంచిర్యాల పట్టణంలోని మున్సిపాలిటీ నీళ్లను వాడుతున్నారు.
మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ, దొరగారి పల్లె, ఒడ్డెర కాలనీ, సుందరయ్య కాలనీ, గొల్లవాడలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. వార్డ్ లో ఉన్న నల్లలు, బోర్ లు పనిచేయక పోవడంతో మున్సిపాలిటీ నుండి వచ్చే మంచినీళ్ళ ట్యాంకర్ లే వారికి ఆధారం. అలాంటి మంచినీళ్ళ ట్యాంకర్ లను ఇలా ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వార్డ్ సభ్యులు పలువురు మంచి నీరు సప్లై చేసే స్థలానికి వెళ్లి అధికారులను నిలదిసినప్పటికి వారు సైతం మేమేం చేయలేము సీఎం మీటింగ్ ఉంది ఇపుడు నీళ్ళు పంపించడం కష్టం అంటూ మాట ధాటేస్తున్నారు అని వారు ఆరోపిస్తునారు. ఈ రోజు ఉదయం పట్టణానికి చెందిన ఒక బీఆర్ఎస్ ముఖ్యనాయకుడు, ట్యాంకర్ లో మంచినీరు సప్లై చేసే అధికారుల దగ్గరికి వెళ్లి వారితో వాగ్వాదానికి దిగి తన వార్డుకు మంచినీటి ట్యాంకర్ లను తీసుకెళ్లినట్లు సమాచారం.