పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్య

by Kalyani |
పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్య
X

దిశ, నల్లబెల్లి: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన పిండి శీను మొదటి భార్య స్వరూపకు సంతానం కలగడం లేదని శ్రీనివాస్ అక్క కూతురు వరుసకు మేనకోడలు ఐనా మానస(25) ను ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. మానసకు కుమారుడు విగ్నేష్, కుమార్తె సాత్విక(2) పుట్టారు. గత గత కొంతకాలంగా కుటుంబం లో తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిపారు.

శనివారం సాయంత్రం మానస మనస్థాపానికి గురై కుమార్తె సాత్విక ను తీసుకుని గ్రామ శివారులోని తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తన కూతురు కు పోసి తను కూడా తాగింది. గమనించిన చుట్టుపక్కల ప్రజలు కుటుంబ సభ్యులు నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మానస ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మానస కూతురు సాత్విక పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక గోవర్ధన్ ను వివరణ కోరగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed