మున్సిపల్ సర్వసభ్య సమావేశం గరంగరం

by Nagam Mallesh |
మున్సిపల్ సర్వసభ్య సమావేశం గరంగరం
X

దిశ, ఆదిలాబాద్ః ప్రతి నెల చివరి రోజున నిర్వహించే ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం గరం గరంగా కొనసాగింది. సమావేశం ప్రారంభంతోనే అధికార కాంగ్రెస్ కౌన్సిలర్ సభ్యులు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మునిసిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్నా అధికార యంత్రంగా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కళ్ళముందే వందల కోట్ల రూపాయల స్థలాలు కనుమరుగవుతున్నా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని ఆందోళన లేవనెత్తారు. మున్సిపల్ స్థలాలను కాపాడవలసిన బాధ్యత అధికార యంత్రంగంపై ఉందన్నారు. స్థానిక జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ సమీపంలో సులబ్ కాంప్లెక్స్ ను కూలగొట్టి మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని, ఈ విషయం ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇలా స్థలాలను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మునిసిపల్ ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన వాటి ని ప్లకార్డులు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్ల మరమ్మతుల కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బిజెపి కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ కొరకు శనివారం దీనిపై ఫిర్యాదు చేయగా గుంతలు పడిన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ సదర్ కాంట్రాక్టర్ వారిని పోల్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ టెండర్ను రద్దు చేయాలని కోరారు. ఇంకా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయని ఏ కాలనీలో సూచన మునిసిపల్ ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతున్నాయని వాటిని ఇప్పటికైనా గుర్తించి మునిసిపల్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed