- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముకాడే ఉత్తం
దిశ, ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామానికి చెందిన ముకాడే ఉత్తం ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి ఉత్తర్వులు అందినట్లు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. వైస్ చైర్మన్ గా గదిగూడ మండలానికి చెందిన సోయం మారుతి, డైరెక్టర్లుగా కోడప శ్రీకాంత్, చాహకటి మాణిక్ రావ్, ప్రకాశ్, అడే గణేష్, కోడప అచ్పత్ రావ్, సిడం జంగు, పరశురామ్, సుమన్ బాయి, ఇంద్రభాయి ఎన్నికయ్యారు.
ముకాడే ఉత్తం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రస్తుత మండల అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేశారు. రైతులకు న్యాయం చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఆయన తెలిపారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీ గుర్తించి సముచిత స్థానాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు ధన్యవాదాలు తెలిపారు.