ఆగ్రహంలో మహిళా కార్యకర్తలు.. TRS ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత

by Dishadaily Web Desk |
ఆగ్రహంలో మహిళా కార్యకర్తలు.. TRS ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత
X

దిశ, మంచిర్యాల: కాంగ్రెస్ మహిళ కార్యకర్తలు ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటిని ముట్టడించారు. మంచిర్యాల కాంగ్రెస్ జిల్లా అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ అనుచరులతో సపర్యలు చేయించుకుంటారంటూ ఎమ్మెల్యే కుమారుడు విజిత్ రావు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే కుమారుడి వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ మహిళ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంట్లోకి దూసుకెళ్లి, విజిత్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో టీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.

Advertisement

Next Story