జన్నారం పోలీస్టేషన్ లో తనిఖీలు

by Sumithra |
జన్నారం పోలీస్టేషన్ లో తనిఖీలు
X

దిశ, జన్నారం : వార్షిక తనిఖీలలో భాగంగా జన్నారం పోలీస్టేషన్ ను గురువారం మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి తనిఖీ చేశారు. పోలీస్టేషన్‌లో సిబ్బంది పనితీరు, నమోదయ్యే కేసుల వివరాలకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీసీ కెమెరాల పనితీరు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల గురించి తీసుకుంటున్న నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని అన్నారు.

ప్రజలు అందించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉందన్నారు. నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. ప్రజల సహకారంతో జన్నారం పట్టణంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన 04 సీసీ కెమెరాలు, కవ్వాల్ క్రాస్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసిన 03, ధర్మారం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటుచేసిన 02 సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్లోని కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేశామని తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎసీపీ వెంట లక్షేట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్, జన్నారం ఎస్సై సతీష్ లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed