- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహాత్మునికి ఘన నివాళులర్పించిన జిల్లా అధికారులు, నాయకులు
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని గాంధీ పార్క్ లో గాంధీ, నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాడి భారతీయులకు స్వేచ్ఛ, స్వతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. అహింస మార్గంలో తెల్లదొరలని తరిమికొట్టిన అఖండ భారతావనికి విముక్తి కలిగించిన భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నేడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మున్సిపల్ కమిషనర్, బాలకృష్ణ, ఎఎంసీ చైర్మన్ పల్లె భూమేష్, ప్రజాప్రతినిధులు, పట్టణ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.