- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏజెన్సీలో ఇప్పపువ్వు లడ్డు..రుచి చూస్తే వావ్ అనాల్సిందే..!
దిశ, ఉట్నూర్ : ఇప్పటి వరకు ప్రజలు పల్లీలు, నువ్వులు, మినప తదితర లడ్డూలు స్వీట్ హౌస్ లో లబించే లడ్డులను తీన్నాం... చూసాం. కానీ ఇప్పపువ్వు లడ్డు తినాలంటే మాత్రం ఏజెన్సీలోని ఉట్నూర్ కి రావాల్సిందే మరి. ఆదివాసీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ఇప్పపువ్వు లడ్డును తయారు చేసి మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు. ఈ లడ్డు తినడం వల్ల పౌష్టికాహారం లభిస్తుందని పలువురు గిరిజనులు అంటున్నారు.
గిరిజనుల ఆలోచన...
ఏజెన్సీలో పూర్వపు గిరిజనులు ఇప్పపువ్వులను తీనే బతికేవాళ్ళు. ఇప్పపువ్వు తినడం వల్ల పౌష్టికాహారం లబించేది. కాలానికి అనుగుణంగా ఇప్పపువ్వు తినడం మానేస్తు వచ్చారు. అయిన ఆచార వ్యవహరాలను, సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోకుండా పండగలకు, గిరిజనుల ఇష్టమైన దైవాలకు ఇప్పపువ్వులతో చేసిన వంటలు, నైవేద్యాలు చేస్తు సమర్పించడం అనవాయితీగా వస్తుంది. గిరిజనులతో పాటుగా ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఐటీడీఏ సహకారంతో 14 లక్షల నిధులు కేటాయించి ప్రజా మిత్ర సహకార సంఘం ఆధ్వర్యంలో భీం బాయి ఆదివాసీ మహిళ సహకార సంఘన్ని ఏర్పాటు చేసి ఈ ఇప్పపువ్వు లడ్డులను తయారు చేయాలని ఆలోచన కు శ్రీకారం చుట్టారు. మండలంలోని ఎక్స్ రోడ్డు సమీపంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన పారిశ్రామిక వాడలోని ఒక షెడ్లో ఆదివాసీ ఆహారం పేరుతో 2019 నుండి ఇప్పపువ్వు లడ్డులను తయారు చేస్తున్నారు. పండిన ఇప్పపువ్వు కంటే ఎండిన ఇప్పపువ్వులో అధిక పోషకాలు ఉంటాయని, ఊసిరి, ద్రాక్ష, ఆపిల్ పండ్లకు మించి ఎండిన ఇప్పపువ్వు లో ఆరోగ్యవంతమైందిగా గుర్తించి ఎండిన ఇప్పపువ్వుతో లడ్డూలను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు నిర్వహకులు తెలిపారు.
లడ్డుకు కావాల్సిన పదార్థాలు..
ఏజెన్సీలోని ఎండాకాలంలో అటవీ నుండి లబించే నాణ్యత గల ఎండిన ఇవ్వపుప్వును కొనుగోలు చేస్తారు. దీనిని శుభ్రపరిచి ఇందులో, కాజు, బాదం, కిస్మిస్, నువ్వులు, పల్లీలు, బెల్లం, చక్కెర, మంచి నూనె, కూడక పోడిలను మిక్సీ చేసి లడ్డూలను తయారు చేస్తున్నారు. ఒక్కొక్క లడ్డును 3గ్రామాల వరకు తయారు చేస్తున్నారు. ఇప్పపువ్వు లడ్డు కిలోకు 400 రూపాయలు గరిష్టంగా ధర నిర్ణయించారు.
లడ్డు రుచి చూస్తే వావ్ అనాల్సిందే..
ఇప్ప పువ్వు తో చేసిన లడ్డులు తిన్న వారందరూ వావ్ అనాల్సిందే.. లడ్డును కొనుగోలు చేసిన వాళ్ళందరూ అంటున్నట్లు ఈ మహిళా సంఘం సభ్యులు తెలిపారు. ఈ లడ్డూలను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు తగు ఏర్పాట్లు చేసినట్లు ప్రజామిత్ర సహకార సంస్థ సభ్యుడు కుంర విఠల్ రావ్ తెలిపారు. అదే విధంగా ఉట్నూర్, జైనూర్ ఇతర మండలాల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గిరిజనులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫర చేస్తున్నారు. లడ్డులను కావాలిన వారికి ఆర్డర్ పై చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకొని...
ఏజెన్సీ లో గిరిజన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇప్పపువ్వు తో తయారు చేసే లడ్డూలను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లు నిర్వహణ సభ్యులు తెలిపారు. తక్కువ నూనెతో లడ్డులను తయారు చేసి లడ్డులను అమ్ముతున్నాం. ఈ లడ్డులు తినడం వల్ల పౌష్టికాహారం లబిస్తుంది.
పోషకాహార నివారణ లక్ష్యంగా కృషి : విఠల్ రావ్, ప్రజా మిత్ర సహకార సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్
ఉమ్మడి జిల్లాలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఇప్పపువ్వు లడ్డుల తయారీ చేయాలని శ్రీకారం చుట్టాం. 21 మంది ఆదివాసీ మహిళలను ఒక సంఘంలా ఏర్పాటు చేసి ఈ లడ్డు నాణ్యత, పోషకాలు తయారీలో ఎన్ఐఎన్ సూచన ద్వారా శిక్షణ ఇప్పించాం. మొదట్లో గిరిజన మండలాల్లోని అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన తర్వాత, ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాల లకు సరఫరా చేస్తున్నాం. పోషకాహార నివారణకై తమ వంతుగా కృషి చేస్తున్నాం.