మహిళా శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి

by Naresh |
మహిళా శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి
X

దిశ, ఆసిఫాబాద్: హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మహిళా శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అదికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళలకు కోటి రూపాయల వరకు రుణం, బీమా సౌకర్యం అందించడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుండి 15 బస్సులో 50 మంది చొప్పున 750 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో సురేందర్‌ను ఆదేశించారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, జిల్లా బ్యానర్లు, ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు, భోజన వసతి కల్పించడంలో పాటు ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారి, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆశావర్కర్లు ఉండేలా చూడాలన్నారు. ఒక్కో గ్రామస్థాయి పరిధిలోని సంఘాలకు కోటి రూపాయల వరకు రుణం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీపీవో బిక్షపతి గౌడ్, డీఎంహెచ్‌వో తుకారాం, ఎంపీడీ రామకృష్ణ, ఆర్టీసీ ఎండీ శ్రీధర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed