మహారాష్ట్ర ఎన్నికల ఎఫెక్ట్.. సరిహద్దుల్లో లిక్కర్ బంద్

by Shiva |
మహారాష్ట్ర ఎన్నికల ఎఫెక్ట్.. సరిహద్దుల్లో లిక్కర్ బంద్
X

దిశ ప్రతినిధి, నిర్మల్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైన్స్ షాపులు మూతపడ్డాయి. మహారాష్ట్ర సరిహద్దును వెంట ఉన్న ఆయా మండలాల్లో ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు షాపులు తెరుచుకునేలా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ రోజు 23న కూడా దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశాలు వచ్చాయి. ఇది తమకు నష్టం కలిగిస్తుందని వైన్స్‌ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సంఘం సూచనతో..

మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పక్కనే ఉన్న తెలంగాణ జిల్లాల నుంచి మద్యం నగదు తరలించే అవకాశాలు అనే నేపథ్యంలో ఎన్నికల సంఘం కఠిన ఆంక్షలు విధించింది ఇందులో భాగంగానే మహారాష్ట్ర సరిహద్దులను తెలంగాణ నుంచి వచ్చే రహదారులను కట్టుదిట్టం చేసి విస్తృత తనిఖీలను పెంచింది ఇందులో భాగంగానే సరిహద్దున ఉన్న మంచిర్యాల కొమరం భీం ఆసిఫాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం ఈ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు సోమవారం సాయంత్రం 6 గంటల బుధవారం సాయంత్రం 6 గంటల దాకా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు అలాగే కౌంటింగ్ తేదీ 23న కూడా ఈ లిక్కర్ దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే మూడు రోజులపాటు మద్యం అమ్మకాలు జరగనీయకుండా అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వైన్స్ యజమానులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ నష్టాన్ని ప్రభుత్వమే పూడ్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed