- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం.. మార్గదర్శకంగా నిలిచిన నిర్మల్ SP
దిశ ప్రతినిధి, నిర్మల్: సభలు సమావేశాలకు హాజరయ్యే పెద్దలు సామాజిక సేవ చేయాలని ప్రసంగాలు చేయడం సహజంగా చూస్తుంటాం. కానీ ఆపదలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు ఐపీఎస్ అధికారి రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నారు. నిర్మల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ బుధవారం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి రక్తదానం చేసి సమాజానికి యువతకు మార్గదర్శకంగా నిలిచారు. నిర్మల్ మండలం తల్వేద గ్రామానికి చెందిన ఎలిశెట్టి నారాయణ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన వెన్నెముకకు శస్త్ర చికిత్స అవసరం అని వైద్యులు చెప్పారు.
5 యూనిట్ల బి - నెగిటివ్ రక్తం అవసరం కావడంతో బాధితుని బంధువులు జిల్లా కేంద్రంలో తమకు తెలిసిన వారిని సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రవీణ్ కుమార్ తనది బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని సమాచారం ఇచ్చారు. వెంటనే ఆసుపత్రికి చేరుకొని రెండు యూనిట్ల రక్తాన్ని బాధితునికి అందించారు. ఎస్పీ ప్రవీణ్ కుమార్ చూపిన మానవత్వాన్ని అన్ని వర్గాలు అభినందించాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల సాటివారి ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు. ప్రతి ఏటా రెండుసార్లు రక్తదానం ఇవ్వడం అలవాటు చేసుకోవాలని యువతకు సూచించారు.