- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ బెడ్ రూమ్ ఎంపిక జాబితాలో అనర్హులు.. ఒకే వ్యక్తికి రెండు గృహాలు
దిశ, మందమర్రి: డబుల్ బెడ్ రూమ్ ఎంపిక జాబితాలో అనర్హులు.. ఒకే వ్యక్తికి రెండు గృహాలు ఎంపికైన ఘటన మందమర్రి మున్సిపాలిటీ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మందమర్రి మున్సిపాలిటీ లో 600 గృహాలను నిర్మించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాల వ్యాపారులు, కాంట్రాక్టు కార్మికులు, సింగరేణి రిటైర్డ్ కార్మికులు, రెవెన్యూ కార్యాలయం సిబ్బంది, చుట్టాలు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికే కాకుండా లక్షల విలువచేసే ఆస్తులు కలిగిన వారి పేర్లు అర్హుల జాబితాలో ఉండడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. ఇదిలా ఉండగా కొంతమంది కి వాహనం ఉందని రిజెక్ట్ కాగా మరికొందరికి కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారని రిజెక్ట్ లిస్టులో పెట్టడం వివాదంగా మారింది.
అలాగే సింగరేణి యాజమాన్యం నిర్మించిన ప్రాణహిత కాలనీ (శిర్కే)లో కొంతమంది అనధికారికంగా నివాసముంటున్నారు. ఇందులో చాలా మంది డబుల్ బెడ్ రూమ్ గృహాలకు దరఖాస్తులు చేసుకోగా.. అందులో కొంతమంది మహిళల పేర్లు అర్హుల జాబితాలో ఉండగా మరికొంత మందివి లేకపోవడం అక్కడ వివాదాస్పదంగా తయారయింది. పాత బస్టాండ్ ప్రాంతంలో ఒక వ్యక్తి రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నాడు.
ఆధార్ కార్డు ఒకటే ఉంది.. కానీ రెండు సార్లు ఎంపికైనట్లు జాబితాలో స్పష్టంగా కనబడుతుంది. దీంతో రెవెన్యూ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక పక్క అన్ని అర్హతలు కలిగిన నిరుపేదలకు గృహాలను మంజూరు చేస్తామని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ లు స్పష్టం చేసినప్పటికీ వాటి జాడలు కానరాకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ గృహాల ఎంపిక విషయంలో రెవెన్యూ అధికారులు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు పట్టణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒకే దగ్గర కూర్చుని వార్డు దరఖాస్తుల పరిశీలన..
డబుల్ బెడ్ రూమ్ గృహాలకు దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సేకరించేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు ఒకే కాడ కూర్చొని విచారణ జాబితాను తయారు చేయడం వల్ల తప్పుడు జాబితా తయారైందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతి గృహానికి వెళ్లి వివరాలను సేకరించవలసిన అధికారులు వాటిని ఖాతారు చేయక పోవడం విడ్డూరంగా ఉంది.
అర్హుల జాబితాను మరోసారి విచారణ జరిపిస్తాం.. మున్సిపల్ కమిషనర్ గాదె రాజు
రెండు పడకల గృహాల ఎంపిక విషయంలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిపై విచారణ జరిపిస్తామని మందమర్రి మున్సిపల్ కమిషనర్ గాదెరాజు తెలిపారు. అనర్హులకు అర్హుల జాబితాలో పేర్లు ఉంటే తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయాలని ప్రజలను కోరారు. ఇలా ఫిర్యాదులు చేసిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతామని చెప్పారు. అసలైన లబ్ధిదారులకే గృహాల పంపిణీ జరుగుతుందని అందులో ఎలాంటి అపోహలకు తావులేదని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదుల స్వీకరణ ఫిబ్రవరి 6 వరకు ఉంటుందని అన్నారు.