- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తరగతులు ప్రారంభం.. పూర్తి కాని పాఠశాల భవనం..
దిశ, మందమర్రి : 2023-24 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల తరగతులు జూన్ 12 నుండి లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కాని గత సంవత్సరం తలపెట్టిన పాఠశాల నూతన భవన నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. గత సంవత్సరం మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలకు రెండు తరగతి గదులు, స్త్రీ, పురుషులకు వేరు వేరు మరుగుదొడ్లు, వంటశాల తదితరుల నిర్మాణాల కొరకు 40 లక్షల రూపాయలు పాఠశాలకు మంజూరయ్యాయి.
సదరు కాంట్రాక్టర్ గత వేసవికాలం పాత భవనాన్ని పూలగొట్టి కొత్త భవనానికి భూమి పూజ చేసి తరగతి గదుల పనులు ప్రారంభించిన అవి నత్త నడకలో నడవడం పై పలువిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణంలో నిధుల కొరత సమస్య తలెత్తడంతో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. గత 27 రోజుల నుండి భవన నిర్మాణ పనులను సదరు కాంట్రాక్టర్ రాత్రి పగళ్ళు చకచకా నిర్వహిస్తున్నారు. అసలే పగలు చేసే పనులలో నాణ్యత లోపాల ఇబ్బందులు ఎదురవుతుంటే సదరు పాఠశాల కాంట్రాక్టర్ రాత్రి పనులు నిర్వహించడం పట్ల భవన నిర్మాణం ఎలా ఉంటుందో అని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
7 తరగతులు.. ఇద్దరు ఉపాధ్యాయులు..
రెండవ జూన్ మందమరి రైల్వే స్టేషన్ రోడ్డు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 7 తరగతులు నిర్వహిస్తుండగా కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విద్యను బోధించడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంగ్లీష్ మీడియం ఒకటవ తరగతి లో 119 మంది, రెండులో 20 మంది, మూడులో 16, నాలుగులో 26, ఐదులో 27, ఆరులో 15, ఏడవ తరగతిలో 16 మంది వివిధ తరగతుల్లో విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అటెండర్, ఆయా వృత్తులను సైతం ఆ ఇద్దరు ఉపాధ్యాయులు చేయడం గమనార్హం.
నిద్రావస్టలో సరస్వతి నిలయం..
మందమర్రి రెండవ జోన్ ప్రాథమికొన్నత పాఠశాల కు దాదాపు 50 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. ఇందులో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించి వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఇక్కడి పాఠశాలకు ఉపాధ్యాయుల అవసరం ఉన్నదని తెలిసిన అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలకులు, ఇటు విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై పెద్ద ఎత్తున పట్టణంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ, సంబంధిత శాఖ నిర్లక్ష్యంతో నిద్రావస్టలో ఉన్న సరస్వతి నిలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.