- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల ఆదేశాలు బేఖాతర్..!
దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేఔట్స్ లేని అక్రమవెంచర్ పై తాసిల్దార్ విశ్వంబర్ తనిఖీ చేశారు. ప్లాట్లలో ఏర్పాటు చేసిన ఫోళ్లను తొలగించాలని వెంచర్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. వెంచర్ నిర్వాహకులు అధికారులకు మూడుగంటల్లో తొలగిస్తామని చెప్పి పంపించారు. ఈ తంతు అంతా జరిగి రెండునెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. అధికారులు వెళ్లి రెండు నెలలక్రితం తొలగించిన పోల్ మాత్రం ఒకటి అదే విధంగా ఉంది. ప్లాట్లలో ఉన్న పోల్స్ మాత్రం చెక్కుచెదరకుండా అదేవిధంగా ఇప్పటికే దర్శనమిస్తున్నాయి. జిల్లా అధికారుల ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు వెళ్లి హెచ్చరికలు జారీ చేసిన ప్లాటింగ్ ఓనర్స్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
తహశీల్దార్ విశ్వంభర్ వివరణ కోరగా..
పల్సిలో లేఔట్స్ లేని వెంచర్ నిర్వాహకుడికి పోల్స్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన మాట నిజమే. ఇప్పటికే రెండుసార్లు హెచ్చరికలు చేశామన్నారు. ఇప్పటికి రెండు నెలలు కావస్తుంది. ఆదేశాలను బేఖాతారు చేస్తున్న నిర్వాహకుడు పై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.