- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IIIT Basara : బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్
దిశ, బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో చీఫ్ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కాలేజీను సందర్శించారు. కళాశాలలో పర్యటించే సమయంలో కమిషన్ సభ్యులకు విద్యార్థులు తమ ఇబ్బందుల గురించి వివరించారు. ఇక పర్యటన అనంతరం సభ్యులు కళాశాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే 6000 మంది బాలికలకు నలుగురు కేర్ టేకర్లు మాత్రమే ఉండడం పై కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కళాశాలలోని మెస్‌లను తనిఖీ చేసి ఆహారాన్ని రుచి చూశారు. దీంతోపాటు కమిషన్ సభ్యులు నిర్వహించిన మీటింగ్‌కు హాజరుకాని చీఫ్ వార్డెన్ శ్రీధర్ పై ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు సీరియస్ అయ్యారు. అలాగే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఫ్యాకల్టీని నియమించాలని కమిషన్ సభ్యులు వీసీకి తెలపడంతో నియామకాలపై కసరత్తు చేస్తుందని ఇన్చార్జి వేసి వెంకటరమణ కమిషన్ సభ్యులకు తెలిపారు. కాగా కళాశాల పర్యటన అనంతరం కమిషన్ సభ్యులు నిజామాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు.