ట్రిపుల్ ఐటీ కి హైకోర్టు నోటీసులు...

by Kalyani |   ( Updated:2024-10-24 17:19:51.0  )
ట్రిపుల్ ఐటీ కి హైకోర్టు నోటీసులు...
X

దిశ, భైంసా : బాసర ట్రిపుల్‌ ఐటీ కి రాష్ట్ర హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసిందని పిటిషనర్ వాపోయారు. ఇక్కడ విద్యనభ్యసించి బయటకు వచ్చిన విద్యార్థులకు సంబంధించిన ఫీజులు ప్రభుత్వం చెల్లించిన, యాజమాన్యం మాత్రం విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థి సామల ఫణికుమార్ హైకోర్టును ఆశ్రయించగా, నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఒక్క విద్యార్థి కాదు వేల మంది విద్యార్థులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తుందని, వాస్తవానికి ట్రిపుల్‌ ఐటీలో సీటు వచ్చిన వాళ్లంతా ఉచిత విద్యను అభ్యసించడానికి హక్కు ఉందని, దానికి సంబంధించిన పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలని, పిటిషనరు విద్యార్థి తరఫున హైకోర్టు న్యాయవాది తక్కురి చందన తన వాదనలు హైకోర్టు కి వినిపించారు. దీంతో తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కి, ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి హైకోర్టు నోటీసులు జారీ చేసిందని పిటిషనర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed