Kadem Project: కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు..

by Sumithra |   ( Updated:2023-07-21 09:55:16.0  )
Kadem Project:  కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు..
X

దిశ, కడెం : ఎగువ ప్రాంతంలో ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా భారీ వర్షాల కారణంగా ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో 695.950 అడుగుల వద్ద ఉంది. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై 14 గేట్లను ఎత్తివేసి 1,76,489 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1,39,400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

కడెం ప్రాజెక్టు సందర్శించిన ఎమ్మెల్యే రేఖా నాయక్, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి..

కడెం ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో ఎమ్మెల్యే రేఖా నాయక్, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14 గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదిలారని అన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉండాలని అన్నారు. ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అన్నారు. వర్షా ప్రభావం ఎక్కువ ఉన్నందువలన యువత ప్రాంతాలకు వెళ్లాలని చురుకుగా ఉండాలని కోరారు. వారి వెంట ప్రజా ప్రతినిధులు, నాయకులు, వ్యక్తిగత సిబ్బంది సహాయక చర్య లో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed