- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి
దిశ,భైంసా : మత్స్యకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం గడ్డెన్న వాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. ఈ సంవత్సరం 13 లక్షల ఇరవై వేల చేప పిల్లలను ప్రభుత్వం 100 శాతం రాయితీతో పంపిణీ చేస్తుందన్నారు. గత సంవత్సరం ఇరవై ఐదు లక్షల చేప పిల్లలు వదిలారని, ఈసారి కూడా అంతే మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మత్స్యకారుల పక్షాన పోరాడతానన్నారు.
అదేవిధంగా నియోజకవర్గంలో 364 చెరువుల్లో మూడుకోట్ల 25 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి మరింత రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ ఏడీతో పాటు మత్స్యకార సంఘం నాయకులు, కౌన్సిలర్లు గౌతం పింగ్లే, సువర్ణ పోశెట్టి, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు సోలంకే భీమ్రావు, రమేష్, పండిత్ రావు పటేల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట లింగురాం, బీజేపీ పట్టణ అధ్యక్షులు మల్లేష్, నాయకులు తూమొల్ల దత్తాత్రి పాల్గొన్నారు.