- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.. మృతుడి బంధువుల ఆందోళన
దిశ, పెద్ద అడిశర్లపల్లి : పెద్ద అడిసర్లపల్లి మండలం పెద్ద గుమ్మడం గ్రామంలో దళిత యువకుడ్ని హత్య చేసి ఆత్మహత్యగా రహస్యంగా తోటలో మామిడి చెట్టుకు వేలాడి ఉంచిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఏపల్లి మండలం పెడ్డగుమ్మడం గ్రామానికి చెందిన మస్కా వెంకటయ్యను( 38) గుర్తుతెలియని దుండగులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తెలిపారు. మృతుడి భార్య అనుమనితులపై గుడిపల్లి ఎస్ ఐ నరసింహ ఫిర్యాదు చేశారు. అనుమానితులను విచరించకపోవడంతో.. మృతుడి కుటుంబ సభ్యులు దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం దేవరకొండ రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
హత్యకు కారణమైన అనుమానితులను అరెస్టు చేసిన తర్వాతే పోస్టుమార్టం అంగీకరిస్తామని భార్య మంజుల రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో దేవరకొండ పోలీసులు సానుకూలంగా స్పందించి..హత్య ఎవరు చేసినా ఎంతటి వారైనా సమగ్ర విచారణ జరిపి..వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ధర్నాలో మృతుని భార్య మసక మంజుల, తండ్రి మసక చంద్రయ్య, తల్లి, సోదరుడు,గ్యార వెంకటయ్య, జిల్లా రాములు, బుర్ర ఎంకన్న, గ్యార నాగయ్య కలిమల శ్రీను, కంబాలపల్లి చంద్రయ్య చంద్ర దోసపాటి వెంకన్న, మహిళలు కుటుంబ సభ్యులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.