- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు కేసుల్లో 4 కేజీల గంజాయి పట్టివేత..
దిశ, కార్వాన్ : హైదారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ టీమ్‌లు తనిఖీలు నిర్వహించి 4.368 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయితో పాటు మూడు గంజాయి మొక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే..నిన్న మొన్నటి వరకు మనవాళ్లు ఒరిస్సా ప్రాంతాలకు వెళ్లి గంజాయిని తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపేవారు. కాని నేడు ఎక్సైజ్ దాడులు పెరుగడంతో ఒరిస్సా పాంతానికి చెందిన వ్యక్తులు గంజాయిని తీసుకొచ్చి స్థానిక అమ్మకందార్లకు ఇచ్చి వెలుతున్న పరిస్థితి చోటు చేసుకుంది. సరూర్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ టి ఎఫ్ టీం ఎస్సై బాలరాజు బృందం గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు బాలాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బుధవారం ఒరిస్సాకు చెందిన కూన సేవ్ అనే వ్యక్తి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో గంజాయిని తీసుకు వచ్చి అమ్మకం దారులకు ఇచ్చి వెళుతుంటాడు. కూన సేన్ వ్యక్తి పట్టుబ డడంతో ఆతడి వద్ద 1.537 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసును సరూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
శేర్‌లింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మియ్యాపూర్ ప్రాంతంలో గంజాయి నిల్వ చేశారనే సమాచారం మేరకు ఎస్టీఎప్ టీమ్ సీఐ సుబాష్‌చందార్‌రావు సిబ్బందితో కలిసి అస్సాం ప్రాంతం నుంచి వచ్చి సెక్యూరిటి గార్డ్‌గా పని చేస్తున్న భరత్ భూయ్యా అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. గార్డ్ వద్ద 1.230 గ్రాముల గంజాయి లభించింది. తాను సెక్యూర్టి గార్డ్‌గా పని చేసే ప్రాంతంలో మూడు గంజాయి మొక్కలను పెంచుతున్నారనే సమాచారం మేరకు వాటిని కూడా స్వాధీనం చేసుకొని నిందితుడిని శేర్‌లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. మల్కాజి గిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరేడ్‌మెట్ వినాయకనగర్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్ టి ఎఫ్ సీఐ బాలరాజు బృందం ఒక ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 1.60 కిలోల గంజాయి లభ్యం అయ్యింది. ఒక స్క్రూటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో పాహిమా బేగం ను అరెస్టు చేశారు. షాన్‌వాజ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారని తెలిపారు. కేసును మల్కాజి గిరి స్టేషన్‌కు అప్పగించారు.గంజాయిని పట్టుకున్న ఎస్ టి ఎఫ్ టీమ్‌లను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి , అసిస్టేంట్ కమిషనర్ ఆర్ కిషన్, ఎస్ టి ఎఫ్ లీడర్ ప్రదీప్‌రావులు అభినందించారు.