- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shiva Karthikeyan : ‘నాన్న ఒక పోలిస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూనే మరణించాడు’.. హీరో ఎమోషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి(Rajkumar Periasamy) దర్శకత్వంలో తెరకెక్కిన అమరన్(Amaran) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతోన్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) అండ్ శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరో హీరోయిన్ లుగా నటించి.. ప్రేక్షకులను మెప్పించారు. జనాలకు ఏకంగా కంటతడి పెట్టించారు. ఇకపోతే తాజాగా అమరన్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఈ సందర్భంగా శివ కార్తికేయ్ మాట్లాడారు. అమరన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించడానికి తన నాన్న కారణమని అన్నాడు. శివ కార్తికేయన్ ఫాదర్ పోలీస్ ఆఫీసర్(Police officer) అని, కానీ విధులు నిర్వహిస్తుండగానే మరణించాడని తెలిపాడు. హీరో నాన్నకు ముకుంద్(Mukund) కు చాలా సిమిలారిటీస్ ఉన్నాయని, అమరన్ మూవీ మా నాన్నకు నివాళి అంటూ వెల్లడించారు. శివకార్తికేయన్ నాన్న దాస్ పోలీసాఫీసర్ గా, జైలు సూపరెండెంట్ గా చేశాడు. ఈ హీరోకు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడే డ్యూటీలో మృతి చెందాడు. గతంలో కూడా శివ కార్తికేయన్ ఓ ఇంటర్వ్యూలో తన నాన్నకు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.