Rakesh Gangwal: సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా రాకేష్ గంగ్వాల్ నియామకం

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-06 13:52:51.0  )
Rakesh Gangwal: సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా రాకేష్ గంగ్వాల్ నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా(America)కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్(Southwest Airlines) ఛైర్మన్‌గా, ఇండిగో కో- ఫౌండర్(Indigo Co-Founder) రాకేష్ గంగ్వాల్(Rakesh Gangwal) నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ గ్యారీ కెల్లీ(Gary Kelly) స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఇయర్ జులైలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ బోర్డులో జాయిన్ అయినా రాకేష్ ఇటీవలే ఆ సంస్థకు చెందిన దాదాపు రూ. 900 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రధాన వాటాదారు అయిన ఇలియట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌(IIM)తో సౌత్‌వెస్ట్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత రాకేష్ గంగ్వాల్ నియామకం జరిగింది. కొత్తగా ఎన్నికైన బోర్డు కమిటీ అధ్యక్షులతో పాటుగా గంగ్వాల్ స్వతంత్ర బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని సౌత్‌వెస్ట్ ప్రకటించింది.

సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థను తిరిగి లాభాల బాట పట్టించేందుకు ప్రెసిడెంట్, సీఈఓ(President, CEO) బాబ్ జోర్డాన్‌(Bob Jordan)తో కలిసి పని చేస్తానని గంగ్వాల్ వెల్లడించారు. కాగా యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌ల ప్రకారం, గాంగ్వాల్ సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న సౌత్‌వెస్ట్‌లో 3.6 మిలియన్(36 లక్షలు) షేర్లను కొనుగోలు చేశారు. ఒక్కో షేరు ధర 29-30 డాలర్ల మధ్య ఉంది. మొత్తం కలిపి వీటి విలువ రూ. 900 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. గంగ్వాల్ ఐఐటీ కాన్పూర్(IIT Kanpur) పూర్వ విద్యార్థి. ఇతను 2022లో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని స్థాపించాడు. గతంలో ఈయన వరల్డ్‌స్పాన్ టెక్నాలజీస్‌(Worldspan Technologies)కు చైర్మన్ అండ్ సీఈఓగా నాయకత్వం వహించాడు.

Advertisement

Next Story