విద్యార్థులకు కాలం చెల్లిన చిక్కీలు.. ఆందోళనలో తల్లిదండ్రులు

by Jakkula Mamatha |
విద్యార్థులకు కాలం చెల్లిన చిక్కీలు.. ఆందోళనలో తల్లిదండ్రులు
X

దిశ, ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల ఎంపీయూపీ స్కూల్‌లో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇచ్చే ఆహార పదార్థాలలో ఎక్స్పైరీ అయిపోయిన చిక్కిలను విద్యార్థులకు ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. అయితే అవి తుప్పు, కంపు రావడంతో విద్యార్థులు వాటిని తినకుండా పక్కన పెట్టేశారు. అది గమనించిన స్థానికులు చిక్కిల పై ఉన్న ఎక్స్పైరీ డేట్ ముగిసిందని గుర్తించి పాఠశాల హెచ్ఎం డి.తులసి వరలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. స్కూల్ హెచ్ఎం వారి పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మాకు అవే సరఫరా చేశారని మేము కూడా విద్యార్థులకు అదే అందిస్తామని కనీసం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో స్థానికులు హెచ్ఎం తులసి వరలక్ష్మి ప్రవర్తన పై మండిపడ్డారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

Advertisement

Next Story