సొసైటీ అక్రమాలపై విచారణ

by Sridhar Babu |
సొసైటీ అక్రమాలపై విచారణ
X

దిశ, కల్లూరు : కల్లూరు సొసైటీలో పలు అవకతవకలపై విచారణ ప్రారంభమైంది. ధాన్యం కొనుగోలు కమీషన్ గోల్మాల్ అయ్యిందని విశాల సహకార పరపతి సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న తోట ప్రవీణ్ అక్టోబర్ 25న తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో డిస్ట్రిక్ట్​ కోపరేటివ్ ఆఫీసర్ అక్టోబర్ 28న విచారణ అధికారిని నియమించారు. అలాగే సోమవారం ఖమ్మంలో జరిగిన గ్రీవెన్స్ లో తోట ప్రవీణ్, నల్లగట్ల రాజేష్ కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదును అందజేశారు.

కల్లూరు సొసైటీలో పలు అవకతవకలకు పాల్పడ్డారని, ధాన్యం కొనుగోలు కమీషన్ గోల్మాల్ అయిందని, సర్వీస్ రికార్డు ట్యాంపరింగ్ జరిగిందని, గతంలో జరిగిన విచారణలో అధికారులు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని, 2006 నుంచి 2021 వరకు సబ్ స్టాప్ గా ఉన్న వ్యక్తి స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేశానని తప్పుడు వాంగ్మూలం ఇచ్చి అధికారులను, పాలకవర్గాన్ని మోసం చేసి సీఈఓ అయ్యాడని వారు కలెక్టర్ కు వివరించారు. దాంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే విచారణ జరిపి నివేదికను అందించాలని ఆదేశించారు.

జిల్లా సొసైటీ అధికారి ఉషారాణి కల్లూరు సొసైటీలో మంగళవారం విచారణ చేపట్టారు. ఈ విచారణ సజావుగా సాగినా నిజాలు నిగ్గు తేలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా, సొసైటీ అక్రమాలపై చర్యలు తీసుకునేలా నివేదికలు ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విచారణలో న్యాయం జరగకపోతే 51 మందిని ఎంక్వయిరీ చేసి సమగ్ర విచారణ చేస్తే సొసైటీ అక్రమాలు బయటపడే అవకాశం ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed