- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CEO Sudarshan Reddy: రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికల సంఘం కీలక రిక్వెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి(CEO Sudarshan Reddy) కోరారు. ఓటర్ల జాబితా, సవరణలపై బుధవారం బీఆర్ కేఆర్ భవన్(BRKR Bhavan)లో ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల ముసాయిదా జాబితా అక్టోబర్ 29 నుంచి అందుబాటులో ఉందని, సవరణలకు నవంబర్ 28 వరకు అవకాశం కల్పించామన్నారు. థర్డ్ జెండర్, పీడబ్ల్యూడీ, ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహాలు (పీవీటీజీ)తో పాటు వెనుకడిన వర్గాలకు చెందిన వారిని కూడా ఓటర్ ఎన్ రోల్ మెంట్‌లో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ఓటరు సమాచారాన్ని ధృవీకరించడం, అప్‌డేట్ చేయడంలో ప్రజలకు సాయం చేసేందుకు ఈ నెల 9, 10 తేదిల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు పోలింగ్ స్టేషన్‌లలో దరఖాస్తులతో ఓటర్లకు సాయం చేయడానికి అందుబాటులో ఉంటారన్నారు. ఇవి కాకుండా ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 29 నుంచి, నవంబర్ 28 వరకు voters.eci.gov.in లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఆన్లైలో దరఖాస్తులను సమర్పించాలని, ఆఫ్ లైన్ లో బీఎల్వో ల ద్వారా సంప్రదించాలని సూచించారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ఓటరు జాబితా సిద్ధం అవుతుందని సీఈవో తెలిపారు. ఈ నెల 5 వరకు స్వీకరించిన, దరఖాస్తులు, గతంలో దరఖాస్తు దారులు అందజేసిన వివరాలు మాత్రమే ఉన్నాయన్నారు. అర్హత గల పౌరులందరూ ప్రత్యేక ఓటరు జాబితా లో తమ వివరాలను నమోదు చేసుకుని, ఓటు వేసి వారి రాజ్యాంగ బద్ధమైన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, సీపీఐ ఎం, ఏఐఎంఐఎం పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.