కాక కుటుంబ పాలనకు బుద్ధి చెప్పాలి.. బీఆర్ఎస్ మాజీ మంత్రి

by Anjali |
కాక కుటుంబ పాలనకు బుద్ధి చెప్పాలి.. బీఆర్ఎస్ మాజీ మంత్రి
X

దిశ,బెల్లంపల్లి: పెద్దపల్లి పార్లమెంటు నియోజవర్గంలో 76 సంవత్సరాలుగా కాక వెంకటస్వామి కుటుంబం దళితుల రాజకీయాలకు డ్యూటీ చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలుత చెన్నూరుకు ప్రాతినిథ్యం వహించిన కాక వెంకట్ స్వామి, ఆ తర్వాత గడ్డం వినోద్ మంత్రిగా, వివేకు ఎంపీగా ప్రస్తుతం గడ్డం బ్రదర్స్ చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లక్షల కోట్ల అధిపతి, వ్యాపారి గడ్డం వంశీ పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు.

మొదటినుంచి కాక కుటుంబమే ఈ ప్రాంతంలో దళితుల రాజకీయ అవకాశాలను దరక్రమణచేస్తున్నాయని విమర్శించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని దళితులు, ప్రజలు, కార్మికులు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో లక్షల కోట్ల అధిపతి పారిశ్రామికవేత్త గడ్డం వంశీకి ప్రజల బాధలు తెలియదన్నారు. వ్యాపార వృద్ధి కోసమే రాజకీయాన్ని రక్షణగా వాడుకుంటున్నారన్నారు. వలస రాజకీయవేత్తలు కాక కుటుంబానికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజలను వంచించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలో ఆలోచించాలన్నారు. ఫ్రీ బస్సుతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదనపడ్డారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకను పార్లమెంట్లో వినిపించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఎన్నికల ఇన్చార్జి రాములు నాయక్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed