వారిపై కఠిన చర్యలు తీసుకోండి సార్..

by Sumithra |
వారిపై కఠిన చర్యలు తీసుకోండి సార్..
X

దిశ, నిర్మల్ రూరల్ : నిర్మల్ జిల్లాలోని కొన్ని ఫెర్టిలైజర్ షాపుల యజమానులు రూ. 266లకు ఇవ్వాల్సిన యూరియా బస్తాను రైతులకు రూ.310, 320, 330లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రైతులు ఎవరైనా ఒరిజినల్ బిల్లు అడిగితే ఇచ్చిన బిల్లుపై రూ.226 వేసి వెనకాల రూ.310, 320, 330 రాసుకుంటున్నారన్నారు. డీఎపీ, 20.20, 13 వీటిపై ఒక బస్తాకు 100 నుంచి 200 ఎక్కువ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం పై రైతులు పలుమార్లు లోకేశ్వరం ఏవో ను కలిసి దరఖాస్తు ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారి డీఏ ఓ.అంజి ప్రసాద్ ను కలవగా పట్టించుకోకుండా షాపు యజమానులకు వాత్తాసు పలుకుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఏవో లోకేశ్వర్ , డీఏఓ లను సస్పెండ్ చేసి ధరల పట్టికను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుల గైని మురళీమోహన్, సహాయ కార్యదర్శి, ముత్తన్న, దేవేందర్, మహిరాజ్, గడ్డం దేవన్న, ఏతన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed