మరో రైతు ఆత్మహత్య.. వాటి భారం భరించలేకే..

by Disha News Desk |
మరో రైతు ఆత్మహత్య.. వాటి భారం భరించలేకే..
X

దిశ, లోకేశ్వరం: మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల భూతం నుంచి తప్పించుకోలేక ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బిలోలి గ్రామానికి చెందిన ఆర్మూర్ గంగాధర్‌కు సొంత వ్యవసాయ భూమి లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం అదే గ్రామంలో ఇతరుల వద్ద రెండు ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. ఆ రెండు ఎకరాల్లోనే గత కొంత కాలంగా వ్యవసాయం చేస్తున్నాడు. కాగా ఆ భూమిలో సరైన దిగుబడులు రాలేదు. దాంతో అతడు పెట్టిన పెట్టుబడులు సైతం చేతికి రాకపోవడంతో ఆ రైతుకు అప్పులు పెరిగిపోయాయి.

ఆ బాధతో రైతు తాగుడుకు బానిసయ్యాడు. అదే మనస్థాపంతో ఈనెల 10న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం బైంసా ఆస్పత్రికి తరలించారు. అతడు చికిత్స తీసుకుంటూ శుక్రవారం ఉదయం మరణించాడని మృతుడి భార్య సాగరా బాయి పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి కుమార్ తెలిపారు.

Advertisement

Next Story