- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెటప్ బాక్స్ ల పేరుతో దోపిడీ
దిశ, కుబీర్ : మండలంలో టీవీ సెటప్ బాక్స్ ల ఫిటింగ్ పేరుతో గ్రామాల్లో రూ.700 నుండి 800 వరకు డిష్ యజమానులు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఒక్కో దగ్గర ఒక్కో రకంగా డిష్ యాజమాన్యాలు వసూళ్లు చేస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. రూ.500, రూ.600, రూ.700, రూ.800 అంటూ ఒక్కోచోట ఒక్కో రకంగా వసూలు చేస్తున్నారు. కాగా పలు చోట్ల (ఎస్ఎస్ )చానల్ యాజమాన్యం మారి జీటీపీఎల్ యాజమాన్యం బాధ్యతలు తీసుకుంది. దీంతో కొత్త సెటప్ బాక్స్ లు పెట్టే పరిస్థితి వచ్చినట్లు తెలిసింది.
సెటప్ బాక్స్ లను ఉచితంగా పెట్టాలనే నిబంధన ఉన్నా రెండు నెలల టీవీ బ్యాలెన్స్ ఉచితంగా వస్తుందని, సెటప్ బాక్స్ పెట్టించుకోవాలని లేకుంటే టీవీలు రావని చెబుతున్నారని ప్రజలు చెబుతున్నారు. దాంతో నిరుపేదలు నెలనెలా టీవీ బ్యాలెన్స్ వేసుకునే వారి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత కంపెనీ యాజమాన్యం నిబంధనలు పాటించేలా చూడాల్సిన అవసరం ఉంది. జీటీపీఎల్ కంపెనీ యాజమాన్యం నిబంధనలను తమ టీవీ మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.
అందరికీ ఒకేలా చార్జీలు ఉండేలా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. కాగా దీనిపై డిష్ యజమానిని వివరణ కోరగా టీవీల్లో మూడు నెలలు, ఆరు నెలల బ్యాలెన్స్ గతంలోనే వేసుకున్న వాళ్లకు సెటప్ బాక్స్ లను ఉచితంగా పెడుతున్నాం అన్నారు. బాక్స్ పెట్టడం వల్ల టీవీలో రెండు నెలల బ్యాలెన్స్ వస్తుంది. నెల రోజుల బ్యాలెన్స్ ముందుగా వేసుకొని ఉన్న వాళ్లకు రూ.600 నుండి రూ. 700 తీసుకుంటున్నామని తెలిపారు.