పురాతన విగ్రహాలే లక్ష్యంగా వరుస తవ్వకాలు..

by Sumithra |
పురాతన విగ్రహాలే లక్ష్యంగా వరుస తవ్వకాలు..
X

దిశ, వేమనపల్లి : రాజారాంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. మండలంలోని రాజారాంలో గత ఏప్రిల్ నెలలో ఎల్లమ్మ దేవత విగ్రహాల వద్ద గుడి నిర్మాణం చేపడతామని నమ్మబలికి జేసీబీ సాయంతో గ్రామదేవతల విగ్రహాల చుట్టూ భారీ తవ్వకాలు జరిపారు. పురాతన దశావతార ఏకశిల విగ్రహాలకు నిలయంగా ప్రాణహిత నది పరిసరాల్లో ఉన్న రాజారం గ్రామం ఎంతో చరిత్రను కలిగి ఉన్నటువంటి గిరిజన గ్రామం గ్రామదేవతలను ఇష్టదైవంగా కొలిచే గిరిజనుల గ్రామాల్లో క్షుద్ర పూజలు గుప్తనిల్ల తవ్వకాల సంఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామ ప్రజలకు గుప్త నిధుల కోసం తవ్వినట్లు అనుమానాలు రావడం పరిసర ప్రాంతాలలో నిమ్మకాయలతో క్షుద్ర పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయని గ్రామస్తులు తెలిపారు.

తవ్వకాలు చేపట్టిన సదరు వ్యక్తిని గ్రామస్థులు నిలదీయడంతో మండలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని మీ గ్రామములో గుడి నిర్మాణం కోసమే తవ్వకాలు చేపట్టామని త్వరలోనే గుడి నిర్మిస్తామని నమ్మబలికి సమస్యను సద్దుమణిగించారు. ఎవరికి అనుమానం రాకుండా తవ్వకాల జరిపిన చోటు కాకుండా మరోచోట గుడి నిర్మాణం చేపట్టారు. గతంలో గ్రామ సమీపంలోని దశావతార విగ్రహాల కింద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు గ్రామ పెద్దలు తెలిపారు. వరుసగా వారం రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు పల్లెప్రకృతి వనంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఏకాశిల విగ్రహం పక్కన అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరపడంతో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. పురాతన దశావతార విగ్రహాలను గ్రామ ప్రజలు ఎంతో ప్రతిమతో కొలుస్తారు.

కావున ఇలా ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్టు నిమ్మకాయలు ఇతర సామగ్రి చిందర వందరంగ పడవేసి ఉన్నాయని గ్రామస్థులు గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరపారని ఒక్కొక్క విగ్రహం వద్ద తవ్వకాలు జరుపుతుంటే గ్రామ ప్రజలు పోలీసుల సమాచారం ఇవ్వడంతో నీల్వాయి ఎస్సై సంఘటన స్థలంలో పోలీసులు ప్రజల నుండి వివరాలను సేకరించారు. ఇలా వరుసగా గ్రామ దేవతల చుట్టూ త్రవ్వకాలు జరుపుతుండడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిసంవత్సరం ఆషాడ మాసంలో కులదైవమైన ఎల్లమ్మ తల్లి బోనాలను సమర్పించడం ఆనవాయితీ, గిరిజనుల ఆచారం. ఈ జాతరకు తెలంగాణలోని ప్రజలే కాకుండా మహారాష్ట్ర ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి భక్తులు మొక్కలు ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన దశావతార ఏకశిలా విగ్రహాల పరిసరాల్లో గుప్తనిధులకు తవ్వకాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి

Advertisement

Next Story