- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెల్లంపల్లి స్ట్రాంగ్ రూమ్ లోకి చేరుకున్న ఈవీఎంలు, వీవీ ప్యాట్లు…
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ జిల్లా కేంద్రం నుంచి రెండు ప్రత్యేక వాహనాల్లో పోలీసు సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు, వీవీ ప్యాట్లు బెల్లంపల్లి కి చేరుకున్నాయి. బెల్లంపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. 283 బ్యాలెట్ ఈవీఎంలు, 317 వీవీ ప్యాట్లు పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. వీటిని అత్యంత భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ, ప్రత్యేక పోలీసు రక్షణ స్ట్రాంగ్ రూములకు ఏర్పాటు చేశారు.
స్ట్రాంగ్ రూములో ఈవీఎంలను భద్రత పరిచి గదులను సీజ్ చేశారు. పోలింగ్ రోజు మాత్రమే ఈవీఎంలు, వీవీ ప్యాట్లును ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని బెల్లంపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ తెలిపారు. గట్టి పోలీసు భద్రత, సాంకేతిక నిఘా పర్యవేక్షణలో ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉంటాయన్నారు. 24 గంటలు p స్ట్రాంగ్ రూములకు పోలీసు భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.