- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాల వర్షాలతో అన్నదాత విలవిల
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశాయి. చెడగొట్టు వానలుగా రైతులు చెప్పుకునే ఈ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో భారీగా రైతాంగం నష్టం చవి చూసింది. ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఈ నష్టం ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 6 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. నిర్మల్ జిల్లాలోని సుమారు 3 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మక్క, నువ్వు పంటలతో పాటు పసుపు, వరి తదితర పంటలు డ్యామేజ్ అయ్యాయి.
నిర్మల్ జిల్లాలో మక్క, నువ్వుల పంటలు ఈ రెండు కలిపే 1700 ఎకరాల వరకు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేయగా ఆదిలాబాద్ జిల్లాలోనూ మొక్కజొన్నకు భారీగా నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో జొన్న తో పాటు కూరగాయల సాగుకు నష్టం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో భారీ వానలకు తోడు ఈదురుగాలులు ఎక్కువగా ఉండడంతో వరి పంట నేలకొరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులకు మామిడి కాయలు నేల రాలి రైతులకు తీవ్ర నష్టం మిగిలింది.
దిశ, ప్రతినిధి నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశాయి. చెడగొట్టు వానలుగా రైతులు చెప్పుకునే ఈ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా రైతాంగం నష్టం చవి చూసింది. ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఈ నష్టం ఎక్కువగా ఉంది.
6 వేల ఎకరాలకు పైగానే...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 6 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఒక నిర్మల్ జిల్లాలోని సుమారు 3 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మక్క, నువ్వు పంటలతో పాటు పసుపు, వరి తదితర పంటలు డ్యామేజ్ అయ్యాయి. నిర్మల్ జిల్లాలో మక్క, నువ్వుల పంటలు ఈ రెండు కలిపే 1700 ఎకరాల వరకు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.
ఇక ఆదిలాబాద్ జిల్లాలోనూ మొక్కజొన్న పంట భారీగా నష్టపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో జొన్న తో పాటు కూరగాయల సాగుకు నష్టం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో భారీ వానలకు తోడు ఈదురుగాలులు ఎక్కువగా ఉండడంతో వరి పంట నేలకొరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు.
గోదావరి నది బెల్ట్‌లోనే ఎక్కువ..
వర్షాల ప్రభావం ఎక్కువగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోనే ఉంది. అయితే ప్రతి ఏటా గోదావరి బెల్టులోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలోనే చెడగొట్టు వానలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వానల కారణంగా మొక్కజొన్న, నువ్వుల చేలల్లో ఉంది. అంతేకాక పసుపు కల్లాల్లోకి చేరిన తరువాత నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతాంగాన్ని ఆదుకుంటాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం. నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం అకాల వర్షాలతో భారీగా నష్టపోయినట్లు తమకు సమాచారం అందింది. రెవెన్యూ వ్యవసాయ శాఖలతో అంచనాలు తయారు చేస్తున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పంట నష్టంపై వివరించి నష్టపరిహారం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాం.