ఒక్కో ఇంట్లో ముగ్గురికి డబుల్ బెడ్ రూం ఇళ్లా..!

by Shiva |
ఒక్కో ఇంట్లో ముగ్గురికి డబుల్ బెడ్ రూం ఇళ్లా..!
X

స్థలాలు ఇచ్చిన వారు ఏమైపోవాలి..

రాస్తారోకోకు దిగిన భాజపా అధ్యక్షురాలు రమాదేవి

దిశ, బైంసా: పట్టణ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల ఎంపికలో నిజమైన లబ్ధిదారులకు, స్థలాల ఇచ్చిన వారికి న్యాయం జరగలేదంటూ బాధితులు న్యాయం కోసం రోడ్డ్కెక్కారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి స్థానిక విశ్రాంతి భవనం ఎదుట రాస్తారోకో చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు సర్కార్ ఇచ్చిన ఇళ్ల స్థలాలు లాక్కొని వాటిని రద్దు చేసి, డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి నేడు ఇళ్లు కేటాయించకపోవడం ఎంత వరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు ఇచ్చిన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించి వారికి న్యాయం చేయాలని కోరారు. బాధితులకు కలెక్టర్, ఆర్డీవో వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలి లేదని రోడ్డుపైనే రాస్తారోకో చేపట్టారు.

వెంటనే అక్కడ ఉన్న తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని ఓ బాధితురాలు ఘాటుగా ప్రశ్నించింది. ఒక్కో ఇంట్లో ముగ్గురికి ఎలా డబల్ బెడ్ రూం కేటాయిస్తారని ప్రశ్నించింది. తమ లాంటి వారు ప్రభుత్వానికి కనబడటం లేదా అంటూ వాదించింది. అందుకు స్పందించిన తహసీల్దార్ అలా కేటాయించి ఉంటే.. వారి సమాచారం తమకు అందజేయాలని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి తమ ఇందిరమ్మ స్థలాలు వారికి కూడా న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.

Advertisement

Next Story