- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య ఆరోగ్య ఉద్యోగుల డైరీ ఆవిష్కరించిన మంత్రి, కలెక్టర్
దిశ ప్రతినిధి, నిర్మల్ : ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం 3194 క్యాలెండర్, డైరీలను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. గురువారం ఆయన నివాసంలో వైద్యారోగ్య ఉద్యోగులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఉద్యోగుల డైరీని ఆవిష్కరించారు. ఆరోగ్యశాఖ ఉద్యోగులు నిరంతరం కరోనా కాలం నుంచి కంటి వెలుగు దాకా కష్టపడి పని చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. ఆరోగ్య ఉద్యోగులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి తన కార్యాలయంలో ఆరోగ్య ఉద్యోగుల డైరీని ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సాధారణ ప్రసవాలను మరింత పెంచేందుకు క్షేత్రస్థాయిలో ఆరోగ్య ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రామ్ కిషన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణ మోహన్ గౌడ్, కార్యదర్శి కన్నయ్య, సంఘం నాయకులు రమణారెడ్డి, సాయిబాబా భోజా రెడ్డి, రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రెడ్డి, పురుషోత్తం, రవి, కిరణ్, భరత్, సాయమ్మ, లక్ష్మి, ఐజే లత పాల్గొన్నారు.